Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల్లోనే.. ఐదు విడతల్లో..యూపీఎస్సీ
న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసుల్లోకి ఎంపిక కోసం ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా జరుగుతుందని యూపీఎస్సీ స్పష్టంచేసింది.అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. దేశంలో కరోనా మహమ్మారి పరిస్థితిపై సమీక్షించిన అనంతరం సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష- 2021ను శుక్రవారం నుంచి యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారమే జనవరి 7,8,9,15,16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటనలో స్పష్టంచేసింది. దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఫ్ఎస్ తదితర అఖిల భారత సర్వీసులకు ఎంపిక చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా ఈ పరీక్ష మూడు దశల్లో జరుగుతుంటుంది.