Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : బుల్లీ బాయ్ యాప్ కేసులో ముంబయి సైబర్ పోలీసులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. బుధవారం ఉదయం ఉత్తరాఖండ్‌కు చెందిన విద్యార్ధి మయాంక్ రావల్ (21)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న ఉత్తరాఖండ్‌కు చెందిన స్వేతా సింగ్ (18), బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధి విశాల్ కుమార్ ఝా(21)ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కేసులో మొత్తంగా ముగ్గుర్ని అరెస్టు చేశారు. అలాగే బుల్లీ బాయ్ యాప్‌ను ఫాలోయింగ్ అవుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించినట్లు ముంబయి పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలే తెలిపారు. వీరిలో ముగుర్ని అరెస్టు చేశామని, మొత్తం ఐదుగుర్ని విచారణ చేయడంతో పాటు, వీరి ఆన్లైన్ చర్యల్ని ట్రాక్ చేసినట్లు తెలిపారు. అలాగే, ఈ యాప్‌ను నిర్వహిస్తున్నవారిని, ట్విట్టర్ ఖాతాలను నిర్వహిస్తున్నవారిని పోలీసులు గుర్తించినట్లు హేమంత్ నాగ్రాలే వెల్లడించారు. అయితే ఇప్పటి వరకూ పట్టుబడని నిందితులు ఆన్లైన్లో, ఇంటర్నెట్లో సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉన్నందున కేసు వివరాల్ని పోలీసులు వెల్లడించడం లేదని నాగ్రాలే చెప్పారు. విలేకరులు సహకరించాలని కోరారు.