Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలతో బాధపడే కోవిడ్ రోగులకు నూతన హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, 60 ఏండ్లు పైబడిన వ్యక్తులు, హైపర్‌టెన్షన్, మధుమేహం, గుండె జబ్బులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తులు/కాలేయం/మూత్రపిండ వ్యాధి, సెరెబ్రోవాస్కులర్ వ్యాధి మొదలైన సహ-అనారోగ్యాలు ఉన్న కరోనా రోగులు తమకు చికిత్స చేస్తున్న వైద్యాధికారులు సరైన మూల్యాంకనం చేసిన తర్వాత మాత్రమే కోవిడ్ హోమ్ ఐసోలేషన్‌కు అర్హులని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.
ఇమ్యునోకాంప్రమైజ్డ్ స్టేటస్ (హెచ్ఐవి, ట్రాన్స్‌ప్లాంట్ గ్రహీతలు, క్యాన్సర్ థెరపీ మొదలైనవి)తో బాధపడుతున్న వ్యక్తులు హోమ్ ఐసోలేషన్‌కు అర్హులు కారని తెలిపింది.
అలాగే, పూర్తి టీకా అందుకున్న వ్యక్తే రోగికి 24×7 గంటలూ సంరక్షణను అందించడానికి అందుబాటులో ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సంరక్షకుడికి, వైద్య అధికారికి మధ్య కమ్యూనికేషన్ ఉండాలని పేర్కొంది. పాజిటివ్‌గా గుర్తించ తరువాత వరసగా మూడు రోజలు పాటు జర్వం లేకపోతే తరువాత ఏడు రోజుల తరువాత హోమ్ ఐసోలేషన్ ముగుస్తుందని తెలిపింది. అయితే వారు మాస్క్‌లు ధరించడం కొనసాగించాలని స్పష్టం చేసింది. 'హోం ఐసోలేషన్ వ్యవధి ముగిసిన తర్వాత మళ్లీ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు. రోగుల యొక్క లక్షణాలు లేని సంబంధీకులు కూడా పరీక్ష చేయించుకోవలసిన అవసరం లేదు' అని మంత్రిత్వ శాఖ తెలిపింది.