Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు బీఎంసీ అధికారులు సస్పెండ్
ముంబయి : బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో కార్మికుడి ఆత్మహత్య ముగ్గురు అధికారుల సస్పెండ్‌కు దారి తీసింది. జీతాలు అందకపోవడం, యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుతో గతనెల 23న రమేశ్ పర్మార్ (27) అనే సఫాయి కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీఎంసీలో గత రెండేండ్లుగా పని చేస్తున్నప్పటికీ రమేశ్ పర్మార్‌కు కనీసం ఒక్క రోజు జీతం కూడా అందలేదు. అయితే, రమేశ్ పర్మార్‌కు జీతాలు చెల్లించని విషయంలో బీఎంసీ అధికారుల అలసత్వం బయటపడింది. దీంతో ఇందుకు బాధ్యులైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, హెడ్ క్లర్క్, మరొక క్లర్క్ లపై సస్పెండ్ వేటు పడింది. పర్మార్ తండ్రి కూడా ఒకప్పుడు బీఎంసీలోనే పని చేసేవాడు. అయితే, ఆయన 2019లో చనిపోవడంతో ఆ ఉద్యోగం పర్మార్‌కు వచ్చింది.