Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి రూ.914 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ : ఓఎన్జీసీ త్రిపుర పవర్ కంపెనీ లిమిటెడ్ (ఓటీపీసీ)లో గెయిల్ 26 శాతం వాటాను స్వాధీనం చేసుకుంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీకి చెందిన ఈ వాటాను గెయిల్ సొంతం చేసుకుంది. ఈ ప్లాంట్ ఏడాదికి 726.6మెగావాట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ వాటా కొనుగోలుకు మహారత్న కంపెనీ గెయిల్ గడిచిన డిసెంబర్ 23న ఆమోదం తెలిపింది. అదేవిధంగా తమ వాటాదారులకు 2021-22కి గాను ఈక్విటీ షేర్‌పై 40 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకోసం రూ.1,776.15 కోట్ల డివిడెండ్‌ను కేటాయించనుంది. ఇందులో కేంద్రానికి రూ.913.84 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది.