Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయాగ్‌రాజ్ వీధుల్లో నిరుద్యోగ యువత గళం
- యూపీ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు
ప్రయాగ్‌రాజ్ : యూపీలో నిరుద్యోగం మరింతగా పెరుగుతోంది. యోగి సర్కార్ తీసుకుంటున్న మతపరమైన రాజకీయ నిర్ణయాల కారణంగా.. యువతకు ఉపాధిలేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వశాఖల్లో ఖాళీలు ఉన్నా..వాటిని భర్తీచేయటంలేదు. దీనికి నిరసనగా ప్రయాగ్‌రాజ్‌లో మంగళవారం రాత్రి నుంచి నిరుద్యోగ యువత భారీ నిరసన చేపట్టారు. యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోస్టర్లు,బ్యానర్లు పట్టుకుని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గడ్డకట్టే చలిని లెక్కచేయకుండా.. ఉపాధి కల్పించాలని కోరుతూ నిరుద్యోగ యువత ఆందోళనకు దిగారు. వేలాది మంది యువకులు ప్రయాగ్‌రాజ్‌లో వీధుల్లోకి వచ్చి సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నగరంలో జరిగిన ఈ పాదయాత్రలో రోజ్‌గార్ నహీ తో ఓట్ నహీ (ఉద్యోగం లేదు, ఓటూ లేదు) అంటూ నినాదాలు చేశారు.బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు తెలుపుతున్న వీడియోను బుధవారం సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ షేర్ చేశారు.''యువతలో కోపాన్ని మీరు అనుభవించగలరా? మిమ్మల్ని పీఠమెక్కించిన యువకులే గద్దె దింపుతారు'' అని యువ హల్లా బోల్ - స్వతంత్ర యువజన ఉద్యమం అధ్యక్షుడు అనుపమ్ ట్వీట్ చేశారు.ఈ నిరసనను ''అలహాబాద్ ఉపాధి ఉద్యమం'' గా అభివర్ణించారు. యువ హల్లా బోల్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్ మిశ్రా మాట్లాడుతూ, ''మాకు (యువతలకు) హిందూ-ముస్లింలు లేదా చైనా-పాకిస్తాన్‌పై (చర్చ) అవసరం లేదు, కానీ ఉపాధి కావాలన్నారు. ఖాళీగా ఉన్న 97000 ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు ప్రధాన డిమాండ్ల జాబితాను మిశ్రా విడుదల చేశారు.ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 5 లక్షల పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.పళ్లాలు..ఇతర వాటిని మోగిస్తూ.. వేలాది మంది యువకులు రాత్రంతా నిరసన తెలిపారని జర్నలిస్ట్ అభరు పేర్కొన్నారు. యువకులు రాత్రిపూట రోడ్లపై కవాతు చేస్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసిన డేటా ప్రకారం, నవంబర్ , అక్టోబర్లలో 7 శాతం, 7.75 శాతంతో ఉంటే.. డిసెంబర్లో దేశ నిరుద్యోగిత రేటు నాలుగు నెలల గరిష్ట స్థాయి 7.91 శాతానికి చేరింది. వరుసగా 2021.సీఎంఐఈ రిపోర్టు ప్రకారం..పట్టణ, గ్రామీణ నిరుద్యోగం గత నెలలో వరుసగా 6.44 శాతం నుంచి 8.21 శాతానికి ఎగబాకింది.డేటా ప్రకారం నిరుద్యోగం పెరగడానికి.. కోవిడ్-19 కేసుల పెరుగుదల, ప్రభుత్వాలు ప్రకటించిన ప్రణాళిక లేని లాక్డౌన్ కారణంగా ఆర్థికవ్యవస్థ అంతా స్థంభించింది. దీంతో ఉపాధిలేక కోట్లాదిమంది నిరుద్యోగులు పస్తులున్నట్టు గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి.