Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క రోజే 58,097 కరోనా కేసులు..
- 200లకు పైగా ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ మొద లైంది. కొత్త కేసులు గణనీయంగా పెరుగుతు న్నాయి. బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 58,097 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందురోజుతో పోలిస్తే ఏకంగా 55 శాతం అధికంగా నమోదుకావడం ఆందోళన కలిగి స్తున్నది. ఇదే సమయంలో కరోనా కారణంగా 534 మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 3,50,18,358కి పెరి గాయి. మరణాలు సంఖ్య 4,82,551కి చేరింది. కరోనా నుంచి కొత్తగా 15,389 మంది కోలుకో వడంతో మొత్తం రికవరీల సంఖ్య 3,43,21,803కి చేరింది. ప్రస్తుతం 2,14,004 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజివిటీ రేటు 4.18 శాతంగాఉంది. రికవరీ రేటు 98.1శాతంగా ఉంది.
2,135కి చేరిన ఒమిక్రాన్ కేసులు..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సైతం దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రాబల్య స్ట్రెయిన్‌గా ప్రకటించింది. ఇప్పటివరకు 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. మొత్తం 2,135 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 828 మంది కోలుకున్నారు. ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 653 నమోదయ్యాయి ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఢిల్లీలో 464, కేరళలో 185, రాజస్తాన్‌లో 174, గుజ రాత్లో 154, తమిళనాడులో 121, తెలంగాణలో 84, కర్నాటకలో 77, హర్యానాలో 71, ఒడిశాలో 37, ఉత్తరప్రదేశ్‌లో 31, ఆంధ్రప్రదేశ్‌లో 24, పశ్చిమ బెంగాల్లో 20, మధ్యప్రదేశ్‌లో 9, ఉత్తరాఖండ్‌లో 8, గోవాలో 5, మేఘలయాలో 5, చంఢఘీర్ 3, జమ్మూకశ్మీర్‌లో 3, అండమాన్ నికోబార్‌లో 2, పంజాబ్‌లో 2, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లఢఖ్‌లో 1, మణిపూర్ 1 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య వెల్లడించింది.
తమిళనాడులో వారాంతాల్లో పూర్తి లాక్డౌన్ !
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 9న ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. తమిళనాడు వ్యాప్తంగా ఆదివారం చేపట్టాల్సిన మెగా వ్యాక్సిన్ క్యాంపులు శనివారానికి వాయిదా వేసింది. కాగా.సీఎంవో నుంచి త్వరలోనే మరిన్ని ఆంక్షలు,అధికారిక ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. అలాగే ప్రతి ఆదివారం తమిళనాడులో లాక్డౌన్ విధించే అవకాశం ఉంది.
రాజస్థాన్‌లో తొలి కరోనా మరణం
మధుమేహంతో పాటు ఇతర రోగాలు ఉన్న రాజస్థాన్‌కు చెందిన ఒమిక్రాన్ రోగి మరణించాడ ని,సాంకేతికంగా ఇది ఒమిక్రాన్ మరణమని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
కోటీ మందికి పైగా పిల్లలకు కరోనా టీకాలు
దేశవ్యాప్తంగా టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. జనవరి 3 నుంచి 15-18 ఏండ్ల మధ్య వయసుగల టీనేజర్లకు టీకాలు ఇచ్చే కార్యక్రమం మొదలైంది.అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి టీనేజర్లకు వ్యాక్సిన్లు ఇస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం నాటికి కోటి మందికిపైగా టీనేజర్లు తొలి డోస్ వ్యాక్సిన్లు అందించినట్టు కేంద్రం వెల్లడించింది. వీరికి కోవాగ్జిన్ టీకాలు వేస్తున్నారు.
కరోనాకు టాబ్లెట్ వచ్చేసింది..!
దేశంలో కరోనాకు టాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. ఈ టాబ్లెట్లను డా.రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ మార్కెటింగ్ చేయనుంది. ఈ మేరకు అమెరికన్ ఫార్మా కంపెనీ మెర్క్ అభివద్ధి చేసిన 'మోల్నుపిరవిర్' టాబ్లెట్లను మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు డా.రెడ్డీస్ సంస్థ ప్రకటించింది. 200 మిల్లీగ్రాముల మాత్రను రూ.35 చొప్పున విక్రయించనున్నట్లు డా.రెడ్డీస్ తెలిపింది. కరోనా సోకిన వారు 5 రోజుల పాటు రోజుకు 8 మాత్రల చొప్పున వేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. కరోనా టాబ్లెట్ ఐదురోజుల కోర్సు ధర రూ.1,400గా డా.రెడ్డీస్ వెల్లడించింది. ఒక్కో డబ్బాలో 40 మాత్రలు ఉంటాయని, ఉదయం నాలుగు, సాయంత్రం నాలుగు చొప్పున వేసుకోవాలని సూచించింది. ఆక్సిజన్ స్థాయి 93 శాతం కంటే తక్కువగా ఉండడంతోపాటు వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉన్నవారికి ఈ ట్యాబ్లెట్లను వినియోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజిఐ) అనుమతిచ్చింది.