Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్
న్యూఢిల్లీ : ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తాజాగా మదుపరుల అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపింది. 'పెట్టుబడులలో భావోద్వేగాలు ఉండరాదు' శీర్షికన దీన్ని విడుదల చేసినట్టు తెలిపింది. ''కోపం, ఆనందం, భయం, ఆందోళన... ఏదైనా సరే మనుషులు మాత్రమే భావోద్వేగాలకు గురవుతుంటారు. వీటికి అతీతంగా ఉంటే అత్యుత్తమ మదుపరునిగా నిలుస్తారు. క్రమశిక్షణతో కూడిన, దీర్ఘకాలిక పెట్టుబడి యొక్క వద్ధి నుంచి మదుపరులు ప్రయోజనం పొందవచ్చు'' అని ఐడీఎఫ్సీ ఎస్సెట్ మేనేజ్మెంట్ సిఇఒ విశాల్ కపూర్ పేర్కొన్నారు.