Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా ఆంక్షలతో ఒత్తిడిలో రుణాలు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు పెరగడంతో బ్యాంక్‌లో మొండి బాకీలు పెరగొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మైక్రోఫైనాన్స్ సంస్థలు, చిన్న వ్యాపారులు, క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు తదితర రంగాలకు బ్యాంక్‌లు ఇచ్చిన రుణాల వసూళ్లలో స్తబ్దత చోటు చేసుకోవడం ద్వారా నిరర్థక ఆస్తులుగా మారొచ్చని విశ్లేషిస్తున్నారు. కరోనా రెండో వేవ్ తర్వాత 2021 ద్వితీయార్థంలో ఎన్పీఏలు తగ్గుమొఖం పట్టాయి. 2021 మార్చిలో 7.48 శాతంగా ఉన్న ఎన్పీఏలు.. సెప్టెంబర్ ముగింపు నాటికి 6.9 శాతానికి తగ్గాయి. తాజా కోవిడ్ ఆంక్షలు మళ్లీ బ్యాంక్‌ల్లో మొండి బాకీల పెరుగుదలకు అవకాశం ఉందని ఎంకే గ్లోబల్ ఫైనాన్సీయల్ సర్వీసెస్ తన రిపోర్ట్‌లో పేర్కొంది.