Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ప్రకటన
జమ్మూకాశ్మీర్ : సాయుధ దళాల ఉపయోగం కోసం కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్లోని గుల్మార్గ్లో ప్రసిద్ధ స్కీ-రీసార్ట్ వద్ద గల 1034 కనల్స్ (5.23 లక్షల చదరపు మీటర్లకు పైగా), ప్రఖ్యాత పర్యాటక సొన్మార్గ్లో గల 354 కనల్స్ ( 1.79 లక్షల చదరపు కిలోమీటర్లకు పైగా) భూమిని అక్కడి ప్రభుత్వం '' వ్యూహాత్మక ప్రాంతాలు''గా ప్రకటించింది. ఈ విషయాన్ని గత డిసెంబర్ 31వ తేదీ నాటి ఉత్తర్వులో ప్రభుత్వ పర్యాటక శాఖ పేర్కొన్నది. కార్ప్స్ కమాండర్ చేసిన అభ్యర్థన మేరకు ఆపరేషన్, శిక్షణావసరాల కోసం ఉత్తర కాశ్మీర్లోని ఈ రెండు స్థానాలను వ్యూహాత్మక ప్రాంతాలుగా ప్రకటించినట్టు వివరించింది. కాగా, ఈ భూమిని ఆర్మీ ఇప్పటికే కొన్నేండ్లుగా వినియోగిస్తున్నదనీ, భూ బదలాయింపులో ఎలాంటి మార్పూ ఉండదని కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ పీ.కే పోలే తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం కింద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అక్టోబర్, 2020లో జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్ యాక్ట్, 1970ని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ సవరించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వును జారీ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.