Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊపిరాడక ఆరుగురు మృతి
- 25 మందికి పైగా కూలీల పరిస్థితి విషమం
గాంధీనగర్ : గుజరాత్‌లోని సూరత్‌లో విష వాయువు కారణంగా ఆరుగురు కార్మికులు చనిపో యారు. వీరంతా ప్రింటింగ్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులే. మొత్తం మీద 25మందికి పైగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సూరత్‌లోని సచిన్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమా దం జరిగింది. సమాచారమందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బందిఘటనాస్థలికి చేరుకున్నది. బాధితు లందరినీ చికిత్సకోసం సివిల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు.
ఏం జరిగింది..?
మిల్లు వెలుపల రసాయనాలతో ఉన్న ట్యాంకర్ అన్‌లోడింగ్‌కు ఉన్నట్ట్టు ప్రింటింగ్ మిల్లు ప్రొడక్షన్ మేనేజర్ తెలిపారు. ఆ ట్యాంకర్ పైపును.. డ్రైనేజీ లైన్లో నుంచి పంపింగ్ చేసే సమయంలో.. రసాయనం లీకైంది. దీని ప్రభావం ఆ పరిసరాల్లో వ్యాపించింది. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో గ్యాస్ లీకైనట్టు సూరత్ సివిల్ హాస్పిటల్ డాక్టర్ ఓంకార్ చౌదరి తెలిపారు. ఊపిరాడటం లేని వారిని గుర్తించి.. అందులో 20 మంది రోగులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. ఇందులో ఆరుగురు రోగులు మరణించారు. వీరిలో కొందరు కోలుకోగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నది.
ఊపిరాడక నేలపైనే..
''అకస్మాత్తుగా ఏదో దుర్వాసన వచ్చింది. ఒక్కొ క్కరిగా అందరూ పడిపోవడం ప్రారంభించారు'' అని మిల్లులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తెలిపారు. ఇదిచూశాక ప్రాణాలుకాపాడుకోవటానికి పరుగులు తీశారన్నారు. మిల్లులో హెల్పర్‌గా పనిచేస్తున్న దిలీప్‌కుమార్ మాట్లాడుతూ.. '' కెమికల్ ట్యాంకర్ నుంచి పొగలు వచ్చాయి. కార్మికులంతా బయటకు పరిగెత్తారు. అంతలోపే దాదాపు 15 నుంచి 20 మంది నేలపై పడిపోయారు. తేరుకునేలోపు ఆస్పత్రికి తరలించారని ఆయన చెప్పారు.