Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మరోసారి కోరలు చాచుతోంది. ఇటలీ నుంచి వచ్చిన ఓ విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్ తేలడం కలకలం రేపుతోంది. మిలాన్ నుంచి 170 మందికి పైగా ప్రయాణీకు లతో కూడిన విమానం పంజాబ్లోని అమృత్సర్కు చేరుకోగా.. అనంతరం చేపట్టిన పరీక్షల్లో ఈ పెద్ద మొత్తంలో కేసులు వెలుగుచూశా యని విమానాశ్రయం డైరెక్టర్ వికె సేథ్ తెలిపారు. కరోనా నిర్ధారణైన ప్రయాణీకులను క్వారెంటైన్ సెంటర్లకు తరలించినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒక్క రోజులోనే 90 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూసిన సంగతి విదితమే.