Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 నిమిషాలు ఫ్లైఓవర్‌పైనే ప్రధాని
- బ్లూబుక్‌లో భద్రతపై ఏమున్నది..?
- రాజకీయం చేసే ఎత్తుగడే : విశ్లేషకులు.
- మోడీ, రాష్ట్రపతిని ఎందుకు కలిశారు..!
బీజేపీని జనం నమ్మటంలేదు. గత ఎన్నికల్లో పరాభవాన్ని దిగమింగుకోలేక కమలం పార్టీ వేసిన ఎత్తుగడే అని విశ్లేషకులు అంటుంటే.. కాదు మోడీని అంతం చేసే కుట్ర అని కాషాయపార్టీ నేతలు అంటున్నారు. దీన్ని గోడీ మీడియా హైలెట్ చేస్తున్నది. అయితే వాస్తవమేంటీ..? పంజాబ్‌ను బద్నాం చేయటం.. రైతుల్ని దెబ్బకొట్టాలన్నది బీజేపీ వ్యూహమా.!
ప్రధాని భద్రత వైఫల్యం ఎవరిదీ..? అసలింతకీ బ్లూబుక్‌లో ఏమున్నది..
మోడీని అడ్డుకున్న ప్రదర్శనకారులు రాజద్రోహులు. వారిని కాల్చి చంపేయాలి
- సీటీ రవి, బీజేపీ నేత
పంజాబ్ సీఎంను చనిపోయే దాకా ఉరితీయాలి - అవథ్ వాఫ్‌ు, బీజేపీ నేత
న్యూఢిల్లీ : నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు మడమతిప్పనిపోరాటం చేశారు. ఢిల్లీ సరిహద్దులోని సింఘా సరిహద్దులో దీక్షకు దిగితే..వారిపై ఖలిస్థాన్ ముద్రవేయటానికి బీజేపీ ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఆ పప్పులేం ఉడకలేదు. మళ్లీ యూపీ మొదలుకుని మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తుండటంతో.. మోడీ మెత్తబడినట్టు నటిస్తున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల్లో కమలం పార్టీ చరిస్మా మసకబారుతుం డటంతో.. తన ప్రాణాలు తీసేవారని మోడీ అనటం చర్చనీయాంశంగా మారింది. ఓట్లు దండుకోవటానికి ప్రధాని హౌదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
రైతుల ప్రదర్శన ఎందుకంటే..?
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ రైతులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. తాను ప్రధాని మోడీని కలిసి 500 మంది రైతులు చనిపోయారని అంటే..వారు నా కోసం చనిపోయారా..అంటూ తిరిగి సమాధానమిచ్చారని తెలిపారు. దీంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. అలాగే లఖింపూర్ ఖేరీలో రైతుల ప్రాణాలు తీసిన కేంద్రమంత్రి అజరుమిశ్రా టెనీ తనయుడు ఆశిష్‌మిశ్రా నిందితుడే అని సిట్ రిపోర్టులు తేల్చినా..కేంద్రమంత్రి అజరుమిశ్రాను క్యాబినెట్ నుంచి తొలగించలేదు. ఎంఎస్పీ విషయంలోనూ నాన్చుతున్నతీరుపై రైతులు ప్రదర్శనకు దిగారు.
ప్రధాని భద్రతలో తప్పు ఎవరిది..అసలు ఎస్పీజీ ప్రొటోకాల్ ఏమున్నదంటే..
ప్రధాని భద్రత గురించి ట్రావెల్ ప్లాన్ అంతా ఎస్పీజీ బ్లూ బుక్‌లో ఉంటుంది. ఇందులో ప్రధానికి సంబంధించి అన్ని విషయాలు ప్రస్తావిస్తాయి. ఒక వేళ భద్రతపరమైన ఏదైనా సమస్య ఎదురైనపుడు..ఎలా సురక్షితంగా తరలించాలి. ఎక్కడ సెఫ్ హౌస్‌లో ఉంచాలి..అనే అంశాలు అడ్వాన్స్ సెక్యురిటీ లైజాన్ ప్రకారం ఎస్పీజీదే బాధ్యత. ఇందులో ఐబీ, రాష్ట్ర పోలీసు విభాగం భాగస్వామ్యులవుతాయి. దీనికోసం ఓ టీమ్‌ను ఏర్పాటు చేస్తారు. దీన్ని ఐబీ,ఎస్పీజీ,స్టేట్ పోలీస్ తయారు చేస్తాయి.అలాగే ఈ బ్లూ బుక్ బుక్లెట్ అంతా 200 పేజీలుంటుంది.
ప్రధాని కార్యాలయానికి ఆ సమాచారం ఇవ్వలేదా..?
1. పంజాబ్‌లో వాతావరణం అనుకూలంగా లేదన్న విషయం ఎస్పీజీకి తెలియదా..? 48 గంటలకు ముందే వాతావరణ శాఖ అధికారులతో ఎస్పీజీ అధికారులు చర్చించలేదా..! అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.ప్రధాని ముందుగా హెలికాప్టర్లో వెళ్లాలనుకున్నారు. వాతావరణం సరిగాలేకపోవటంతో.. రోడ్డుమార్గాన వెళ్లాలని మోడీ నిర్ణయించారు.
2.ఒకవేళ వాతావరణం సరిగాలేక..హెలికాప్టర్ ఫిరోజ్‌పూర్‌కు చేరటం సాధ్యం కానపుడు..రోడ్డు మార్గాన వెళ్లటానికి ముందు చర్చించారా..?లేదా అన్నదే బిగ్ డౌట్.
ఎందుకంటే అడ్వాన్స్ సెక్యురిటీ లైజాన్ ముందుగానే తయారు చేస్తారు. అలాంటప్పుడు దేశప్రధాని భద్రత విషయంలో ముందుస్తు చర్చ జరిగిందా..లేదా..అనే వాదన వినిపిస్తున్నది.
3. ప్రధాని 111 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజేపీ ర్యాలీ స్థలానికి చేరాలని అనుకున్నారు. సుమారు రెండు గంటలపాటు వెళ్లాల్సిన దూరం. అయితే దానికి తగ్గట్టు అంతదూరం ప్రయాణించటానికి చర్చించారా..ఎవరు అనుమతిస్తే..మోడీ ముందుకు వెళ్లటానికి సిద్ధమయ్యారు. ఒకవేళ ఐబీ, ఎస్పీబీ లాంటి భద్రత సంస్థలు వారించినా.. రాజకీయ కోణంలోనే ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారా..?అనే చర్చకు తావిస్తోంది. వాస్తవానికి ప్రధాని పర్యటనకు వెళ్లే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రత అవసరం. కానీ మోడీ వెళ్తున్న ఆ మార్గంలో ఆందోళన చేసే అవకాశాలున్నాయని ఎందుకని గుర్తించలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే ఎస్పీజీ ప్రధాని ఆ మార్గంలో వెళ్లటానికి సెక్యురిటీ క్లియరెన్స్ ఇవ్వలేదు. వాస్తవానికి బ్లూబుక్ ప్రకారం రాష్ట్ర పోలీసులు అనుమతించేదాకా..ఎస్పీజీ ఎట్టి పరిస్థితుల్లోనూ పచ్చజెండా ఊపదు. ఒకవేళ ప్రధాని ప్లాన్ ప్రకారం రోడ్డుమార్గాన తీసుకెళ్లాల్సిఉంటే.. దీనికి ఎస్పీజీ చీఫ్, పంజాబ్ డీజీపీలు బాధ్యత వహించాల్సిఉంటుంది. ఇద్దర్ని ఆయా పదవులనుంచి తొలగించాలి. మోడీని ఆందోళనకారులు అడ్డుకున్న ఘటనలో ఎస్ఎస్పీని సస్పెండ్ చేసినట్టు ప్రకటిస్తే..ఎవరిపై చర్య తీసుకోలేదనీ, రాష్ట్ర ప్రభుత్వానిది ఎలాంటి తప్పులేదని పంజాబ్ సీఎం చన్నీ స్పష్టం చేశారు.
మోడీ వస్తున్న విషయం తెలియకుండానే..
బీకేయూ క్రాంతికార్ సంఘటన్ నేతృత్వంలో ఎంఎస్పీ కోసం రహదారిపై ఆందోళనకు దిగారు. లఖింపూర్ ఖేరీ ఘటనతోపాటు..రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని రోడ్డుపైకి ఆందోళనకు దిగారు. ది ట్రిబ్యున్ కథనం ప్రకారం ఆందోళనకు దిగిన రైతులకు మోడీ ఆ మార్గంలో వస్తున్న విషయం కూడా తెలియదా..అని పేర్కొన్నది.అయినా మోడీ వెనక్కి వెళ్లకుండా..20 నిమిషాలసేపు అక్కడే ఉన్నారు.ఇంతలో ఆ వంతెనపైకి బీజేపీ మద్దతుదారులు నినాదాలు చేసుకుంటూ జెండాలతో మోడీ కారువద్దకు చేరుకున్నారు. ప్రధాని భద్రత గురించి చొరవచూపాల్సిన ఎస్పీజీ బీజేపీ శ్రేణులను ఎలా అనుమతించింది..? ఇలాంటి అనుమానాలెన్నో.
ఇటు బీజేపీ శ్రేణులు..అటు రైతుల నినాదాలు
బ్రిడ్జి వద్ద బీజేపీ సపోర్లర్లు..ఇటు రైతులు నినాదాలు చేస్తూ కనిపించారు. ప్రధాని పర్యటనకు ముందు ఒక పైలెట్ కార్ ఉంటుంది. మిగతా కార్లకు ఎలర్ట్ చేస్తుంది. ఆందోళనకారులు ఉంటే.. ఎందుకని అప్రమత్తం చేయలేదు? 20 నిమిషాలసేపు మోడీ కారును ఎందుకు నిలిపారు. కేవలం 20 కిలోమీటర్ల దూరంలో నుంచే యూటర్న్ ఎందుకు తీసుకోలేదు. ఎస్పీజీ ఎందుకని రియాక్ట్ కాలేదు.అంతసేపు ఎందుకని నిరీక్షణ చేసింది.? నేను ప్రాణాలతో బయటపడ్డా..సీఎం చన్నీకి చెప్పండని మోడీ అధికారులతో అన్నారు.ప్రధాని భద్రత చూసే ఎస్పీజీపై అనుమానాలు. ఎందుకంటే ప్రధాని భద్రత బాధ్యత ఎస్పీజీదే కాబట్టి. 20 నిమిషాల సేపు ప్రధాని కారు వంతెనపై ఆగిఉంటే..భద్రత టీమ్ రెండు వైపులా నిలబడింది. కానీ ముందుభాగాన ఎవర్ని నిలబెట్టలేదు. ఇలా ఎందుకని చేయలేదు. ముందు భాగాన ప్రదర్శన కారులు, బీజేపీ కార్యకర్తల నినాదాలు రికార్డ్ అవుతూనే ఉన్నాయి.
ఎన్నికలు దగ్గరపడుతుంటే..
నేను ప్రాణాలతో బయటపడ్డా..అంటూ ప్రధాని మోడీ ప్రకటన వెనుక రాజకీయ ఎత్తుగడేనని స్పష్టమవుతోంది. తాను వెళ్లాలనుకున్న ఫిరోజ్‌పూర్ బీజేపీ సభలో జనం లేక ఖాళీ కుర్చీలు ఉన్న విషయం మోడీకి తెలిశాక.. దీన్ని రాజకీయం చేస్తే..ఇటు రైతులు..అటు పంజాబ్‌ను దెబ్బతీయోచ్చు. పనిలోపనిగా వచ్చే ఎన్నికల్లో కమలంపార్టీకి ఓట్లు దండుకోవచ్చనే మోడీ సంచలనవ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో తమ హక్కులకు భంగం కలిగినపుడు నల్లజెండాలు ప్రదర్శించటం..ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళమెత్తడం సర్వసాధారణం. కానీ మోడీ అధికారంలోకి వచ్చాక..ప్రతిదీ రాజకీయం చేయాలన్న తలంపుతో ఉన్నట్టు కనిపిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రధాని భద్రత వైఫల్యమెవరిదన్న అంశం ఇపుడు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. దీంతో పాలు..నీళ్లలా వాస్తవాలు వెలుగులోకి వస్తాయా..లేదా..అని జనంలో చర్చ. కాగా గురువారం రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను ప్రధాని మోడీ భేటీ కావటం కూడా చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు అడ్డుకోవడంతోనే...ఎస్కేఎం
రైతులను పోలీసులు అడ్డుకోవడంతోనే రోడ్డుపై బైటాయించాల్సి వచ్చిందని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కే ఎం) స్పష్టం చేసింది. ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనపై గురువారం ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, దర్శన్ పాల్, గుర్నామ్ సింగ్ చదుని, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లేవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ శర్మ (కక్కాజీ), యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేసింది. జనవరి 5న పంజాబ్‌లో ప్రధాని ప్రతిపాదిత పర్యటనకు వెళ్లనున్నారనే వార్త తెలియగానే, సంయుక్త కిసాన్ మోర్చాకు అనుబంధంగా ఉన్న 10 రైతు సంఘాలు కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా తేనిని అరెస్టు చేయాలనీ, అలాగే ఇతర అత్యుత్తమ డిమాండ్ల కోసం నిరసనలను ప్రకటించాయని తెలిపారు. జనవరి 2న పంజాబ్ అంతటా గ్రామ స్థాయిలోనూ, జనవరి 5న జిల్లా, తహసీల్దారు ప్రధాన కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు ప్రకటించాయని, ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకోవాలని, ఆయన కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే కార్యక్రమం లేదని పేర్కొన్నారు.
ఓ సానుభూతి స్టంట్ : రాకేశ్ తికాయత్
పంజాబ్‌లోని ఓ ఫ్లైఓవర్‌పై ప్రధాని మోడీ కాన్వారు 20 నిమిషాలు నిలిచిపోవడంపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పందించారు. 'ప్రజల సానుభూతి కోసం చేసిన స్టంట్' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.