Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బుల్లీ బారు యాప్ సృష్టికర్తను గురువారం అస్సాంలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 'బుల్లీ బారు యాప్ సృష్టికర్త, ప్రధాన కుట్రదారుడు నీరజ్ బిష్ణోయిని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఐఎఫ్‌ఎస్‌ఒ బృందం అసోంలో అరెస్టు చేసింది. బుల్లీ బారును గిట్‌హబ్ ఫ్లాట్‌ఫామ్‌లో రూపొం దించాడు. ఈ యాప్‌ను సృష్టించిన వ్యక్తి ట్విట్టర్ ఖాతాను కలిగి ఉన్నాడు' అని ఇంటిలెజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్‌ఎస్‌ఒ) పోలీస్ డిప్యూటీ కమిషనర్ మల్హోత్రా మీడియాకు తెలి పారు. భోపాల్‌లో ఇంజనీరింగ్ సెకెండియర్ చదువుతున్న 21ఏండ్ల నీరజ్ బిష్ణోయిని అతని స్వస్థలమైన అస్సాంలోని జోర్హాత్‌లో అరెస్టు చేశారు. విచారణ కోసం గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి తీసుకొచ్చారు. వందలాది ముస్లిం మహిళల చిత్రాలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో వేలం పేరుతో ఉంచిన బుల్లీబారు యాప్ కేసులో ఇప్పటివరకూ నలుగురిని అరెస్టు చేసినట్లయింది.