Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ లే అవుట్లక్రమబద్దీకరణపై కేంద్రం, తెలంగాణ, ఏపీలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ : అక్రమ లే అవుట్లను క్రమబద్దీకరించటం సరికాదంటూ దాఖలైన పిటిషన్‌కు కౌంటరు దాఖలు చేయాలని కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులు గతంలో క్రమబద్దీకరణకు సంబంధించి ఇచ్చిన జీవోలు సవాల్‌చేస్తూ తెలంగాణలోని జమ్మికుంటకు చెందిన జువ్వాడి సాగర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు 16 డిసెంబర్ 2020న అన్ని రాష్ట్రాలు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకూ కర్నాటక, సిక్కిం మాత్రమే కౌంటరు దాఖలు చేశాయి. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హృషికేష్ రారులతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. అక్రమ లే అవుట్లని చెబుతూనే వాటిని ప్రభుత్వాలు క్రమబద్దీకరించడం సబబు కాదన్నారు. ఇలా చేయడం వల్ల కాలుష్యం, మురుగు నిలిచిపోవడం, ట్రాఫిక్ రద్దీలతో ప్రజలకు అసౌకర్యం కలుగుతుందన్నారు. అక్రమ లే అవుట్లువేస్తున్న వారిపై చర్యలు తీసుకోని అధికారులపై విచారణ చేయడానికి సీబీఐని పార్టీ చేయాలని పిటిషన్లో కోరినట్టు తెలిపారు. కర్నాటక, సిక్కింలు కౌంటరు దాఖలు చేసినప్పటికీ రిట్ పిటిషన్‌లోని ప్రతివాదులైన ఏపీ, తెలంగాణ, తమిళనా డులు ఎందుకు కౌంటరు దాఖలు చేయలేదని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు ప్రశ్నించారు. కౌంటరు దాఖలు చేయడానికి సమయం కావాలని ఏపీ అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ మెV్ాఫూజ్ నజ్కీ, తమిళనాడు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీంతో ప్రతివాదులందరూ కౌంటరు దాఖలు చేయడానికి ఎనిమిది వారాలు గడువు ఇస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.