Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఒమిక్రాన్ ఉధృతి కారణంగా విదేశాల నుండి వస్తున్న ప్రయాణీకులు ఇకపై వారం రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ప్రస్తుతం అమలు చేస్తోన్న మార్గదర్శకాలను సవరించింది. ఇందులో భాగంగానే ముప్పు ఎక్కువ ఉన్న దేశాల నుండి భారత్కు వచ్చిన ప్రయాణికులు... తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది. ఎనిమిదో రోజు కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు జనవరి 11 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.