Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇటలీ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో పాజిటివ్ నిర్ధారైన
న్యూఢిల్లీ : ఇటలీ నుంచి పంజాబ్ వచ్చిన ఒక చార్టర్డ్ విమానంలో 125 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. వారిలో 13 మంది కరోనా బాధితులు తప్పించుకు పారిపోయినట్లు అధికారులు తెలిపారు. పరారైన వ్యక్తుల పాస్‌పోర్టులను రద్దు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు అమత్సర్ డిప్యూటీ కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ ఖెహ్రా వెల్లడించారు. ఇటలీలోని మిలాన్ నుంచి 179 మంది ప్రయాణికులతో ఒక ఛార్టర్డ్ విమానం పంజాబ్‌లోని అమత్సర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా.. 125 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. వారిని అమృతసర్‌లోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. అయితే వారిలో నుండి గురువారం సాయంత్రం 13 మంది ప్రయాణికులు పారిపోయారని అన్నారు. వీరి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. పాజిటివ్ వ్యక్తులు వెంటనే ఆసుపత్రులకు తిరిగి రాకపోతే వారి ఫొటోలను వార్తా పత్రికల్లో ప్రచురిస్తామని డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు. ఇప్పటికే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇటలీలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి విపరీతంగా ఉంది. దీంతో అక్కడ కేసుల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే ఆ దేశంలో 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.