Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అశోక యూనివర్సిటీ వ్యవస్థాపకులపై సీబీఐ అభియోగాలు
న్యూఢిల్లీ : దేశంలోని వివిధ బ్యాంకుల నుంచీ రుణాలను తీసుకుని.. ఎగ్గొట్టిన అశోక యూనివర్సిటీ వ్యవస్థాపకులు వినీత్ గుప్తా, ప్రణవ్ గుప్తాలపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. చండీఘర్‌కు చెందిన పార్మాసూటికల్ కంపెనీ పారాబోలిక్ డ్రగ్స్‌కు సంబంధించిన రూ. 1,626 కోట్లు కుంభకోణానికి పాల్పడింది. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ ఫార్మా సంస్థ, ప్రణవ్, వినీత్ గుప్తాలతో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేసింది. వీరంతా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మరో 11 బ్యాంకులను మోసగించారని తెలిపింది. గత నెల 31 పలు నగరాల్లో గుప్తాలకు చెందిన ప్రాంగణాల్లో సోదాలు చేపట్టగా.. నకిలీ పత్రాలు, ఆర్టికల్స్, రూ. 1.58 కోట్ల విలువ చేసే నగదును స్వాధీనం చేసుకున్నామని సీబీఐ పేర్కొంది. గుప్తాలపై ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి అభియోగాలు నమోదు చేశారు. కాగా, అశోక యూనివరి ్సటీ వెబ్ సైట్లో వినీత్ గుప్తా వ్యవస్థాకుడు, ట్రస్టీగా, ప్రణావ్ గుప్తా సహ వ్యవస్థాపకులు, ట్రస్టీగా పేర్కొనబడి ఉంది. 1996లో ఏర్పాటు చేసిన పారాబోలిక్ డ్రగ్స్‌ను గుప్తా బ్రదర్స్ ప్రమోట్ చేశారు. కాగా, సీబీఐ విచారణలో పారాబోలిక్.. నకిలీ డాక్యుమెంట్లతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుఎస్‌ఒ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎగ్జిమ్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్ఐడీబీఐ వంటి నుంచి రుణాలను పొందారు. రుణాలు చెల్లించడం లేదంటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేయగా.. సీబీఐ విచారణ చేపట్టింది.