Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు నెలల తర్వాత లక్ష మార్కును దాటిన కేసులు
- దేశంలో 1,17,100 కోవిడ్-19 కొత్త కేసులు
- వీటిలో 3007 ఒమిక్రాన్ కేసులు ొ ఆందోళన పుట్టిస్తున్న మహమ్మారి వ్యాప్తి
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి దడ పుట్టిస్తున్నది. దాదాపు ఏడు నెలల తర్వాత (214 రోజుల తర్వాత) తొలిసారి కరోనా కేసులు లక్ష మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.17 లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కిందటి రోజు నమోదైన కేసులతో పోలిస్తే ఇది 28 శాతం అధికం కావడం గమనార్హం.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,17,100 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దాదాపు 214 రోజుల తర్వాత దేశంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,52,26,386కు చేరింది. ఇందులో దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదైన 3007 ఒమిక్రాన్ కేసులూ ఉన్నాయి. ఒమిక్రాన్ బాధితుల్లో 1199 మంది కోలుకున్నారు. ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,71,363కు పెరిగింది. దాదాపు గత 120 రోజుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. భారత్‌లో కరోనా కారణంగా తాజాగా 302 మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య దేశంలో 4,83,178కి చేరింది. ఇక 30,836 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,43,71,845కి చేరింది. రికవరీ రేటు 97.57 శాతంగా ఉన్నది.ఇక ఓమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో అత్యధికంగా (876 కేసులు) నమోదయ్యాయి. ఢిల్లీ (465), కర్నాటక (333), రాజస్థాన్ (291), గుజరాత్ (204), తమిళనాడు (121) లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక తెలంగాణలో 107, ఆంధ్రప్రదేశ్‌లో 28 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుదల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తం గా అనేక రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలను ప్రకటించాయి.ఇటు కేంద్రం కూడా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లను వేగవంతం చేసింది. కాగా, బుధవారం నాడు దేశవ్యాప్తంగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2630గా ఉన్న విషయం తెలిసిందే.
ఇటలీ నుండి వచ్చిన మరో విమానంలో 170 మందికి పైగా కరోనా
ఇటలీ నుంచి వచ్చిన మరో విమానంలో 170 మందికి పైగా కరోనా సోకడం కలకలం రేపింది. ఇటీవల వచ్చిన తొలి విమానంలో 125 మంది కరోనా బారిన పడ్డ సంగతి విదితమే. తాజాగా మరో సంఘటన జరిగింది. శుక్రవారం ఇటలీలోని రోమ్ నగరం నుంచి 290 మంది ప్రయాణికులతో పంజాబ్‌లోని అమత్సర్కు విమానం చేరుకోగా.. ఆ తర్వాత చేపట్టిన పరీక్షల్లో 173 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. వీరందరినీ ప్రోటోకాల్ ప్రకారం నగరంలోని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులకు తరలించారు. కాగా, ఇటలీని 'ఎట్ రిస్క్' దేశంగా పరిగణించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
విదేశీ ప్రయాణీకులకు 7 రోజుల హౌం క్వారంటైన్ తప్పనిసరి : కేంద్రం
ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఇకపై వారం రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ప్రస్తుతం అమలుచేస్తున్న మార్గదర్శకాలను సవరించింది. ఇందులో భాగంగానే ముప్పు ఎక్కువ ఉన్న దేశాల నుంచి భారత్‌కు వచ్చిన ప్రయా ణికులు... తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది. ఎనిమిదో రోజు కరోనా పరీ క్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు జనవరి 11 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.