Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఓ విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలకు వర్చువల్ ప్రచారానికి అనుతినిచ్చినట్టయితే.. అన్ని రాజకీయ పార్టీల పట్ల ఈసి ఒకేలా అవకాశాలు కల్పించాలని అన్నారు. ఒక వేళ డిజిటల్ ప్రచారానికి అవకాశం కల్పిస్తే.. బిజెపి వద్ద ఉన్న మౌలిక సదుపాయాలు ఇతర పార్టీల వద్ద్ద లేవని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడానికి ముందు లక్నోలోని ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన అఖిలేష్ 'రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ కొంత నిధులను అందించాలని, దాని ద్వారా అవి ఒక మెట్టు ఎదిగి.. మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటాయి. ఎందుకంటే... బిజెపికి ఉన్న మౌలిక సదుపాయాలతో పోటీ పడలేం. ఆ నిధులందిస్తే.. తద్వారా బిజెపికి ధీటుగా అన్ని పార్టీలు బలమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుని, పోటీకి దిగుతాయి' అని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు వర్చువల్ ప్రచారాన్ని నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే... ఎస్పి సన్నద్ధంగా ఉందా అన్న ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.