Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే
ముంబయి: కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రం కావడంతో కోవిడ్ నిబంధనలు పాటించని పక్షంలో లాక్డౌన్ అమలు చేయక తప్పదని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే హెచ్చరించారు. కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజుకోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో జాల్నాలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా మించిపోయిందేమి లేదని, లాక్డౌన్ వద్దనుకుంటే కరోనా నియమాలు కచ్చితంగా పాటించాల్సిందేనని లేని పక్షంలో ఆంక్షలు మరింత కఠినం చేయాల్సి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు.