Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీకి ఐఐఎం బృందం బహిరంగ లేఖ
న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న విద్వేషపూరిత వ్యాఖ్యలు, కుల ఆధారిత హింసకు వ్యతిరేకంగా నోరు తెరవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని మోడీకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యార్థులు, అధ్యాపకుల బృందం బహిరంగ లేఖ రాసింది. మీ మౌనం.. విద్వేషంతో నిండిన స్వరాలకు ధైర్యాన్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. 'ప్రధాని మోడీ.. మీ మౌనం.. విద్వేషపూరిత స్వరాలకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా.. దేశ ఐక్యత, సమైక్యతకు ముప్పు కలిగిస్తున్నది. దేశాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా మీరు (మోడీ) నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు విద్యార్థులు, ఉపాధ్యాయులు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై 13 మంది ఉపాధ్యాయులతో సహా 183 మంది సంతకాలు చేశారు.