Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 1-15 మధ్య కాలంలో కరోనా ధర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఐఐటి మద్రాస్ ప్రాథమిక అంచనా వేసింది. గతంలో కన్నా అధికంగా కేసులు నమోదు కావచ్చుననిఐఐటి మద్రాస్ గణిత విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. జయంత్ ఝా తెలిపారు. గత వేవ్‌ల కన్నా విభిన్నంగా ఉండవచ్చునని.. టీకాలు తీసుకోకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం వంటి ఈ సమస్యను మరింత జటిలం చేయవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. క్వారెంటైన్ నిబంధనలు, ఆంక్షలు పెరిగితే.. కాంటాక్ట్ రేటు తగ్గవచ్చునని, అప్పుడు ఆర్ఒ తగ్గవచ్చునని అన్నారు. మద్రాస్ ఐఐటి చేపట్టిన గణన నమూనాల ప్రాధమిక నిర్ధారణ ఆధారంగా ఆర్ఒ విలువ గత వారంలో (డిసెంబర్ 25 నుండి డిసెంబర్ 31 వరకు) జాతీయ స్థాయిలో 2.9కి దగ్గరగా ఉంది. ఈ వారం (జనవరి 1-6 వరకు ) 4గా నమోదైంది. ఆర్ఒ ట్రాన్సిబులిటీ ప్రొబబులిటీ, కాంటాక్ట్ రేట్, ఇన్ఫెక్షన్ వ్యాపించే అంచనా విరామ సమయం వంటి మూడింటిపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.