Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : అగ్ని ప్రమాదాలలో 'యాక్ట్ ఆఫ్ గాడ్'కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువర్చింది. తుఫాను, వరదలు, పిడుగులు, భూకంపం వంటి బాహ్య సహజ శక్తుల ప్రమేయం లేని అగ్ని ప్రమాదాన్ని 'యాక్ట్ ఆఫ్ గాడ్' గా పేర్కొనలేమని తెలిపింది. ఈ మేరకు ఒక కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. లిక్కర్ తయారీ కంపెనీకి సంబంధించిన గోడౌన్లో అగ్ని ప్రమాదం 'యాక్ట్ ఆఫ్ గాడ్'గా పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. సదరు కంపెనీకి ఎక్సైజ్ పన్ను నుంచి మినహాయింపునిచ్చింది. అయితే, సదరు లిక్కర్ కంపెనీకి హైకోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ యూపీ ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఏ.ఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని న్యాయమూర్తులు దినేశ్ మహేశ్వరీ, కృష్ణ మురారీలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. వాదోపవాదనల అనంతరం సుప్రీంకోర్టు పై విధంగా తీర్పును వెలువర్చింది.