Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఏయిరిండియాలో పెట్టుబడులు ఉపసంహరణ ప్రక్రియకు వ్యతిరేకంగా బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ పూర్తిగా అర్హత లేనిదని చెప్పింది. ఏయిరిండియా ప్రయివేటీకరణలో భాగంగా కేంద్రం పాటిస్తున్న పెట్టుబడులు ప్రక్రియ ఏకపక్షమనీ, దీనిని పక్కనబెట్టాలంటూ ఢిల్లీ హైకోర్టులో స్వామి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇది విధానపరమైన నిర్ణయమనీ, న్యాయసమీక్షలో జోక్యానికి అవకాశం లేదని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు స్వామి పిటిషన్ను కొట్టివేసింది. కాగా, ఈ పిటిషన్ను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, టాటా కంపెనీకి చెందిన టాలేస్ ప్రయివేటు లిమిటెడ్ తరఫున సీనియర్ అడ్వకేటు హరీశ్ సాల్వేలు వాదనలు వినిపించారు.