Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో వర్సిటీ కాలేజీ టీచర్ల ఆందోళన
న్యూఢిల్లీ : ఢిల్లీలో వర్సిటీల పరిధిలోని పలు కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్లకు గత ఆరు నెలలుగా జీతాల్లేవు. దాంతో కాలేజీ టీచర్స్ ఆందోళనబాట పట్టారు. వర్సిటీ పరిధిలోని 12 కాలేజీలకు ఢిల్లీ సర్కార్ నిధులను విడుదల చేయటం లేదని, దాంతో తమకు జీతాలు నిలిచిపోయాయని కాలేజీ టీచర్స్ సమ్మెకు పిలుపునిచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం నిధులు నిలిపివేయటంతో ఆ కాలేజీలు సెల్ఫ్ ఫైనాన్సింగ్‌తో నడుస్తున్నాయని ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.కె.భాగీ చెప్పారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ వల్ల పేద విద్యార్థులపై భారం పడుతోందని, ఉన్నత విద్యలో పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. దేశంలో టాప్ కామర్స్ కాలేజీల్లో షాహీద్ సుక్దేవ్ కాలేజీ ఆఫ్ కామర్స్ ఒకటి. ఇలాంటి ప్రఖ్యాత సంస్థల మనుగడనే ప్రశ్నార్థకం చేసే విధంగా ఢిల్లీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.