Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థల ఎఫ్సిఆర్ఎ లైసెన్సును కేంద్రం పున రుద్ధరించింది. ఆ సంస్థ ఇక విదేశీ విరాళాలను స్వీకరించవచ్చు. కొంత ప్రతి కూల సమాచారం వచ్చిందని ఆరోపిస్తూ విదేశీ విరాళాల లైసెన్సును కేంద్రం కొద్దిరోజుల క్రితం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకు ఎఫ్సి ఆర్ఎ లైసెన్సులను పునరుద్ధరించినట్లు కేంద్ర హోం శాఖ అధికారి తెలిపారు. దీంతో, కోల్కతా ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ విదేశీ నిధులను అందుకోవడంతోపాటు బ్యాంకుల్లో వున్న డబ్బును ఖర్చు పెట్టుకోగలుగుతుంది.