Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా రెండోరోజు లక్ష దాటిన కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్ మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. వరుసగా రెండో రోజూ కొత్త కేసులు లక్ష దాటాయి. ముందురోజు కంటే 21 శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 3 వేల పైనే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల మేరకు ... నిన్న 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 1,41,986 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.28 శాతానికి పెరిగి ఆందోళన కలిగిస్తోంది. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించిందని కేంద్రం వెల్లడించింది.