Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 14న జారీ అవుతుంది. అభ్యర్థులు జనవరి 21 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 27. కాగా పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుంది. తొలిదశలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జనవరి 21న జారీ అవుతుంది. అభ్యర్థులు జనవరి 28 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 31. ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగుతుంది. రెండో దశలో ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 25న జారీ అవుతుంది. ఫిబ్రవరి 1 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఫిబ్రవరి 4. కాగా పోలింగ్ ఫిబ్రవరి 20న జరుగుతుంది. ఈ దశలో ఉత్తరప్రదేశ్‌లో మరికొన్ని చోట్ల ఎన్నికలు జరగనున్నాయి.
నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 27న జారీ అవుతుంది, అభ్యర్థులు తమ నామినేషన్లను ఫిబ్రవరి 3 వరకు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 4న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 7. కాగా పోలింగ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది. ఈ దశలో ఉత్తరప్రదేశ్‌లో మరికొన్ని చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ఐదో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 1న జారీ అవుతుంది. ఫిబ్రవరి 8 వరకు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. వీటి పరిశీలన ఫిబ్రవరి 9న జరుగు తుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 11. కాగా పోలిం గ్ ఫిబ్రవరి 27న జరుగుతుంది. ఐదో దశలో ఉత్తరప్రదేశ్‌తో పాటు మణి పూర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 4న విడుదలవుతుంది. ఫిబ్రవరి 11 వరకు నామినేషన్లను దాఖలు చేయ వచ్చు, వీటి పరిశీలన ఫిబ్రవరి 14న జరుగుతుంది. నామినేషన్ల ఉపసం హరణకు చివరి తేదీ ఫిబ్రవరి 16, కాగా పోలింగ్ మార్చి 3న జరుగుతుంది. ఆరో దశలో ఉత్తరప్రదేశ్, మణిపూర్‌ల్లో మరికొన్నిచోట్ల ఎన్నికలు జరగను న్నాయి. ఏడో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 10న విడుదలవుతుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 17 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. వీటి పరిశీలన ఫిబ్రవరి 18న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 21 వరకు గడువు ఉంది. పోలింగ్ మార్చి 7న జరుగుతుంది. ఈ దశలో ఉత్తరప్రదేశ్‌లో మరికొన్నిచోట్ల ఎన్నికలు జరగనున్నాయి.