Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి మనస్సుఖ్ మాండవీయ
న్యూఢిల్లీ : 12 నుంచి నీట్ పీజీ కౌన్సిలింగ్ చేపట్టనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి మనస్సుఖ్ మాండవీయ వెల్లడించారు. కొవిడ్ పై పోరాడుతున్న సమయంలో దేశానికి ఇదెంతో బలాన్నిస్తుందన్న ఆయన.. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 2021-22 ఏడాదికి నీట్ పీజీ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇందుకు సిద్ధమైంది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి నీట్ పిజి కౌన్సిలింగ్ చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైంది.