Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధతి అధికంగా ఉంది. గత కొన్ని రోజులుగా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌లో పదివేల నుండి కేసులు లక్ష చేరేందుకు 100 రోజులు పడితే.. థర్డ్‌వేవ్‌లో పదిరోజుల్లో లక్షకు చేరుకున్నాయని కేంద్రం పేర్కొంది. మరోవైపు థర్డ్‌వేవ్‌లో ఆస్పత్రిలో చేరేవారి రేటు (హాస్పిటలైజేషన్) 5-10 శాతం మధ్య ఉండవచ్చని కేంద్రం హెచ్చరించింది. సెకండ్ వేవ్‌లో ఈ రేటు 20-30 శాతం ఉందని తెలిపింది. ప్రస్తుత వైరస్ పరిస్థితి క్రియాశీలక, వ్యాప్తి చెందే దశలో ఉందని, దీంతో ఆస్పత్రిలో చేరేవారి రేటు పెరగవచ్చని హెచ్చరించింది. సోమవారం 1.79 కేసులు నమోదవగా, రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. పది రోజుల క్రితం దేశంలో రోజువారీ కేసులు సగటున 10వేలు -15 వేల మధ్య ఉండేవి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్, కొనసాగుతున్న డెల్టా వేరియంట్లతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వ్యాప్తి చెందడంతో రోజురోజుకి అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారిందని, పెరుగుతున్న కేసులకి సరిసమానంగా ఆస్పత్రుల బెడ్లను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది.