Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆసియాలోని ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎం2పీ ఫిన్టెక్ తొలిసారి లాంచన ప్రాయంగా మహిళలకు సగం రోజు ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 'బెటర్ హాఫ్' కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఉద్యోగానికి ఎంపికైన వారు రోజులో 5 గంటల పాటు సేవలందిస్తే చాలని తెలిపింది. వీరికి పూర్తి సమయం ఉపాధిని కోరుకునే వ్యక్తి అందుకునే అన్ని ఇతర ప్రయోజనాలను కల్పిస్తున్నట్టు తెలిపింది. దీనికి ఎంపికయ్యే వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని.. అయితే క్రమక్రమంగా పని గంటలను పెంచడం ద్వారా పూర్తి సమయం పనిని కొనసాగించడాన్ని సులభం చేసేలా కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆ కంపెనీ పేర్కొంది. తక్కువ వ్యవధిలో తమ బందంలో 10 శాతం మంది బెటర్ హాఫ్ సభ్యులుగా ఉంటారని ఈ ఫిన్టెక్ సహ వ్యవస్థాపకుడు ప్రభు రంగరాజన్ తెలిపారు