Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : గడిచిన డిసెంబర్లో ద్రవ్యోల్బణం సూచీ ఆరు మాసాల గరిష్ట స్థాయికి చేరొచ్చని రాయిటర్స్ పోల్లో నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏడాది మధ్య నాటికి వడ్డీ రేట్ల పెంపు కూడా ప్రారంభం కావొచ్చని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. జనవరి 4-7 మధ్య చేపట్టిన ఈ సర్వేలో 41 మంది ఆర్థిక నిపుణులను భాగస్వామ్యం చేసింది. నవంబర్లో 4.91శాతంగా నమోదయిన రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ డిసెంబర్లో 5.80 శాతానికి ఎగిసే అవకాశం ఉందని అత్యధిక మంది అభిప్రాయపడ్డారు. ఇది 2021 జూన్ నాటి గరిష్ట స్థాయి.