Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మన దేశంలో త్వరలో కత్రిమ గుండె తయారుకానుంది. కత్రిమ గుండెను తయారుచేసేందుకు ఐఐటి కాన్పూర్ పూనుకుంది. ఇప్పటికే కత్రిమ గుండెను తయారు చేయడానికి ఐఐటీకి చెందిన ప్రొఫెసర్లు, అమెరికా నిపుణులు, ఎయిమ్స్, అపోలో, ఫోఇ్టస్, మేదాంత వైద్య సంస్థలకు చెందిన సీనియర్ వైద్యులతో కూడిన బందం నిమగమైంది. వైద్య రంగంలో ఐఐటీ కాన్పూర్ సాధించిన విజయాల్లోనుంచే.. కత్రిమ గుండె ఏర్పాటుకు బీజం పడిందని.. ఈ మేరకు లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ (ఎల్వీ ఏడీ) పేరుతో కత్రిమ గుండెను రూపొందించనున్నామని వైద్య బందం వెల్లడించింది.
'కరోనా సమయంలో తక్కువ ధరకే వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఐఐటీ కాన్పూర్ తయారుచేసింది. వైద్య రంగంలో ఎన్నో ఘన విజయాల్ని సాధించిన ఐఐటీ కాన్పూర్ కత్రిమ గుండెను తయారుచేయలేదని కొందరు అన్నారు. దీన్ని మా విద్యా సంస్థ సవాల్‌గా స్వీకరించి వెంటనే కత్రిమ గుండె తయారుకు కార్యదళాన్ని ఏర్పాటు చేశాం. కత్రిమ గుండె తయారు చేయడానికి కనీసం ఐదేళ్లు పడుతుంది. మొదటగా దీన్ని జంతువులపై ప్రయోగిస్తాం. దశలవారీగా పరికరాన్ని పరిశీలించి అనంతరం మార్కెట్లోకి తెచ్చేందుకు ఐదేళ్లు పడుతుంది.' అని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ అమితాబ్ బంధోపాధ్యారు అన్నారు. కత్రిమగుండె రీఛార్జ్ చేసుకునేందుకు వీలుగా బ్యాటరీలు అమర్చామని.. అవి 12 గంటల వరకు పనిచేస్తాయని ఆయన వెల్లడించారు. అయితే కత్రిమ గుండె పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల వాటి ధర అధికంగా ఉంటోందని బంధోపాధ్యారు పేర్కొన్నారు. బహుశా ఐఐటీ కాన్పుర్ తయరుచేసే కత్రిమ గుండె పరికరం ధర మాత్రం చాలా తక్కువగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు.