Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : 'సహారాశ్రీ' సుబ్రత రారు సహారాకు న్యూరొలాజికల్ (బ్రెయిన్) సర్జరీ విజయవంతంగా జరిగింది. ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ఈనెల 6న డాక్టర్ మనీశ్ శ్రీవాస్తవ ఈ సర్జరీని చేశారు. 'సహారాశ్రీ'కి ఇటీవలనే ఆయనకు ఈ వ్యాధి బయటపడింది. కాగా, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారు. ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జి అయ్యారు. చక్కని వైద్యం, సేవలు, తన శీఘ్ర రికవరీకి కారణమైన కోకిలాబెన్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని 'సహారాశ్రీ' చాలా ప్రశంసించారు.