Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రీచ్క్యాండి ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స
ముంబయి: ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు కరోనా సోకింది. ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆమె సమీప బంధువు రచ్నా మీడియాకు వెల్లడించారు. 92 ఏండ్ల లతా కు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నప్పటికీ.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ''లతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఆమె వయస్సు దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారం రోజులపాటు అబ్జర్వేషన్లో ఉంచనున్నట్టు బ్రీచ్క్యాండి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.మా గోప్యతను గౌరవించండి. ఆమె కోసం ప్రార్థించండి' అని రచ్నా కోరారు.కరోనా వైరస్ మొదటి దశలోనూ లతా మంగేష్కర్‌కు కోవిడ్ నిర్ధారణైంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం విదితమే.