Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీలో చేరిన మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య
- కమలంపార్టీని వీడిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు
- నిన్న గోవా..ఇపుడు యూపీలో బీజేపీకి షాక్
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యోగి ప్రభు త్వంలో మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం మంత్రి పదవికి రాజీనామా చేశారు. సమాజ్‌వాదీపార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలో సైకిల్ పార్టీలోకి చేరారు. స్వామి ప్రసాద్‌కు మద్దతుగా ఎమ్మెల్యేలు బ్రిజేష్ ప్రజాపతి, భగవతి ప్రసాద్ సాగర్, రోషన్ లాల్ వర్మ కూడా బీజేపీని వీడారు. ఇప్పుడు స్వామి ప్రసాద్ మౌర్యతో పాటు మంత్రి ధరమ్ సింగ్ సైనీ సహా మరో నలుగురు ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరవచ్చని చర్చ జరుగుతోంది. నిన్న గోవాలో మంత్రి మైఖేల్ లోబో మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. తాజాగా స్వామిప్రసాద్ మౌర్య బీజేపీని వీడి..ఎస్పీలో చేరటంతో కమలంపార్టీ వర్గాలు షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాయి.
యూపీ బీజేపీలో కరోనా కలకలం
ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ కరోనా కలకలం రేపుతోంది. ఆ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి రాధా మోహన్ సింగ్‌కు కరోనా పాజిటివ్ సోకింది. ఆయన హాజరైన సమావేశంలో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ కూడా ఉన్నారు.రాధా మోహన్ సింగ్ ఐసోలేషన్‌కు వెళ్లగా..కొందరు ప్రచారాల్లో బిజీ అయ్యారు. వీరు సూపర్ స్పైడర్‌గా మారవచ్చనే భయం పార్టీ వర్గాలను వెంటాడుతోంది.