Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగర్తలా : త్రిపురలో ట్రాన్స్జెండర్లకు తీవ్ర అవమానం జరిగింది. నలుగురు ట్రాన్స్జెండర్లను అరెస్టు చేసిన పోలీసులు.. లింగ నిర్ధారణ కోసం దుస్తులు తీయించారు. అంతేకాకుండా ఎప్పటికీ ఇటువంటి దుస్తులు ధరించమని, ఇలాంటి వేషధారణలో కనిపిస్తే అరెస్టు చేయవచ్చునన్న ఓ హమీనికి కూడా పోలీసులు వారితో బలవంతంగా రాయించుకున్నారు. శనివారం రాత్రి ఓ హోటల్లో పార్టీ నుండి బయటకు వచ్చిన నలుగుర్ని అరెస్టు చేశారు. సోమవారం వారిని విడిచిపెట్టిన తర్వాత.. వారిలో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఎటువంటి ఆధారాలు లేకున్నా.. తాము దోపిడీకి పాల్పడ్డామన్న ఆరోపణలపై.. పశ్చిమ అగర్తలా మహిళ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని, ఆ స్టేషన్లో తమ దుస్తులు పోలీసులు విప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మా విగ్గులు, ఇన్నర్ గార్మెంట్స్ను పోలీస్ స్టేషన్లో ఉంచారని పేర్కొన్నారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎల్జిబిటి కమ్యూనిటీ సభ్యులు మండిపడ్డారు. తమ గోప్యత హక్కును ఉల్లంఘించారని, సుప్రీంకోర్టు ఇచ్చిన జాతీయ లీగల్ సర్వీసెస్ అధారిటీ తీర్పులోన సెక్షన్ 377 అందించిన హక్కులను కూడా ఉల్లంఘించారని పేర్కొన్నారు.