Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 మంది మేజర్ జనరల్స్ ఫిర్యాదు
చండీగఢ్ : జూనియర్ల కంటే తక్కువ పెన్షన్ వస్తుందని మేజర్ జనరల్ ర్యాంక్‌కు చెందిన 18 మంది అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, పెన్షన్ పంపిణీ అధికారుల్ని ఆర్మడ్ ఫోర్సెస్ ట్రిబ్యూనల్ (ఎఎఫ్టీ) బుధవారం ఆదేశించింది. 'జస్టిస్ రాజేంద్ర మీనన్, లెఫ్టినెంట్ జనరల్ పిఎం హరీజ్లతో కూడిన ట్రిబ్యునల్ బెంచ్ మా పిటిషన్‌ను అంగీకరించింది. అలాగే పిటిషన్‌ను ఎందుకు అనుమతించకూడదో కారణం చూపాలని ప్రభుత్వాన్ని, ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్‌ని కోరింది' అని పిటిషనర్ల తరఫు న్యాయవాది కల్నల్ ఇంద్రసేన్ సింగ్ (రిటైర్డ్) తెలిపారు.
త్రివిధ దళాలకు చెందిన బ్రిగేడియర్ ర్యాంక్, దానికి సమానమైన అధికారుల ప్రాథమిక వేతనంలో ఆరవ, ఏడవ సెంట్రల్ పే కమిషన్ (సిపిసి)లో ప్రవేశపెట్టడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో మేజర్ జనరల్, అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న అధికారులు మిలిటరీ సర్వీస్ పే (ఎంఎస్పి)కు అర్హులు కారు. దీని ఫలితంగా ఎయిర్‌ఫోర్స్, నేవీల్లోని మేజర్ జనరల్, సమానమైన ర్యాంక్ అధికారి తన పదవీ విమరణ తరువాత బ్రిగేడియర్ కన్న తక్కువ వేతనాన్ని పొందుతాడు.