Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూట్యూబ్‌కు నిజ నిర్ధారణ సంస్థల లేఖ
న్యూఢిల్లీ : తప్పుడు సమాచారం ప్రసారం కాకుండా చూడాలని యూట్యూబ్ యాజమాన్యానికి ప్రపంచంలోని 80 వార్తల నిజ నిర్ధారణ సంస్థలు బహిరంగ లేఖ రాశాయి. ప్రస్తుతం యూట్యూబ్ తప్పుడు సమాచారం ప్రచారానికి ఒక సాధనంగా మారిందని వారు ఆరోపించారు. అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక నుంచి ప్రారంభించి ఆఫ్రికాలోని సంస్థల వరకు ఈ విజ్ఞప్తి లో భాగస్వాములయ్యారు. నాణ్యమైన వార్తలను, వాస్తవాలను సరిచూసుకుని అప్పుడు మాత్రమే వార్తలను ప్రచారం చేయాలని వారు కోరారు. దీనికి యూట్యూబ్ యాజమాన్యం స్పందించింది. నిజ నిర్ధారణకు తాము కట్టుబడి ఉన్నామని ఎంతో ఖర్చు పెడుతున్నామని తెలిపింది.