Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో కమలంపార్టీని వీడుతున్న మంత్రులు
- యోగి క్యాబినెట్ మినిస్టర్ దారాసింగ్ చౌహాన్ రాజీనామా
- ఎస్పీలో చేరటానికి బీజేపీనేతల క్యూ
లక్నో: యూపీలో బీజేపీ షాక్‌ల మీద షాకులు తగులుతు న్నాయి. ఓవైపు మతరాజకీయాల తో గట్టె క్కాలని కమలంపార్టీ భావిస్తుంటే ఆపార్టీకి రోజుకొకరు చొప్పున మంత్రులు గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా యూపీ అటవీ,పర్యావరణ శాఖ మంత్రి దారా సింగ్ చౌహాన్ బీజేపీని వీడారు. తన రాజీనామా లేఖను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బుధవారం పంపించారు. దళితులు, రైతులు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం తనను బాధించిందని ఆ లేఖలో ప్రస్తావించారు. రాశారు. వెనుకబడిన, దళితుల రిజర్వేషన్లతో ఆడుకోవడం కూడా తనను బాధించిందని పేర్కొన్నారు. దారా సింగ్‌ను హుటాహుటిన చార్టర్డ్ విమానంలో పార్టీ పెద్దలు..ఢిల్లీకి పిలిపించి బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. స్వామి ప్రసాద్ మౌర్యతో పాటు క్యాబినెట్ మంత్రి దారా సింగ్ చౌహాన్ కూడా ఎస్పీలో చేరబోతున్నట్టు తెలిసింది. దారా సింగ్ 2017 ఎన్నికలకు ముందు బీఎస్పీని వీడి బీజేపీలో చేరారు. ఇప్పటి వరకు ఆయన మౌలోని మధుబన్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. యోగి క్యాబినెట్‌లోని మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్పీ వైపు చూస్తున్నతీరుతో పార్టీ హై కమాండ్‌కు ఏం చేయాలో తెలియటంలేదు. ఎన్నికల ముందు యూపీలో తలనొప్పిగా మారిన బీజేపీ జంపింగులతో ఆ పార్టీనేతల బుర్రలు వేడెక్కుతున్నాయి.