Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ భద్రతా వైఫల్యంపై ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్య్ర దర్యాప్తు కమిటీ విచారణ చేపట్టనుంది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లోని బహిరంగ సభకు వెళుతున్న ఆయన పాకిస్తాన్ బోర్డర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఫైవర్పై 20 నిమిషాల పాటు నిలిచిపోయిన సంగతి విదితమే. మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఇందు మల్హోత్రా నేతత్వంలో విచారణ కమిటీ దర్యాప్తు చేపడుతోంది. ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతారు. అయితే బటిండా నుంచి ర్యాలీ ప్రాంతానికి ప్రధాని ప్రయాణించడానికి హెలికాఫ్టర్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చారా లేదా ..స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)కి భారత వైమానిక దళం ఎటువంటి నివేదికలు ఇచ్చిందన్న దానిపై విచారణ చేపడుతున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారి తెలిపారు. అయితే ప్రధాన మంత్రిని రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్లాలని ఎవరు సూచించారనే దానిపై దర్యాప్తు చేస్తారని సమాచారం. ఇంటలిజెన్స్ బ్యూరోకు అందిన సమాచారానికి సంబంధించి.. ఎస్పిజి, పంజాబ్ పోలీసుల పాత్రను పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. హుస్సేనివాలాకు మోడీ వెళ్లే సమయంలో ఆందోళన జరగవచ్చునని పంజాబ్ ప్రభుత్వానికి తెలియజేసినట్లు..ఇంటెలిజెన్స్ బ్యూరో.. హౌం మంత్రిత్వ శాఖకు తెలిపింది.
హౌం మంత్రిత్వ శాఖ అధికారిక రికార్డుల ప్రకారం.. నిషేధిత గ్రూప్ ' సిక్స్ ఫర్ జస్టిస్' చెందిన గురుపత్వంత్ సింగ్ పన్నూ.. యువతకు డబ్బులిచ్చి.. ఆందోళనలు చేపట్టాలని ప్రయత్నించినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చింది. మోడీ సభ పాక్‌కు దగ్గరలో ఉన్నందున.. అప్రమత్తంగా ఉండాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. ఇవన్నీ భద్రతా లోపమేనని ఐబీ మాజీ డైరెక్టర్ అన్నారు. ప్రధాని భద్రత సంబంధించి.. నిర్ణయం తీసుకునే వ్యక్తులకు.. వత్తి నైపుణ్యం లేదని, వారు రూల్‌బుక్‌ను అనుసరించాలని.. పంజాబ్ పోలీసులు, ఎస్పీజీ రెండూ ఆయన భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఎస్పిజి సరైన కసరత్తులు చేసి ఉంటే.. ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు... ఆయనకు సురక్షిత నివాసాన్ని కేటాయించి ఉండేవారని, కానీ అలా చేయలేదని, దీంతో మోడీ ఒంటరిగా రహదారిపై ఇరుక్కోవలసి వచ్చిందని అన్నారు. డ్రిల్ ప్రకారం.. పైలట్ కారుతో ప్రధాని మోడీ కారు కదులుతుందని, చివరికి మరో కారుతో కాన్వారు ముగుస్తుందని, కానీ ముందస్తు భద్రతా బందం ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని మార్గాలను సందర్శిచినప్పుడు.. పరిశీలిస్తారని పేర్కొన్నారు. కానీ ఆయన ఆగిన చోటు.. బిజెపి మద్దతుదారులు ఆందోళన చేపట్టారంటే.. భద్రతా లోపమేనని అన్నారు. ప్రధాని ఓ రాష్ట్ర పర్యటనకు వెళ్లేటప్పుడు.. బ్లూబుక్‌ను అనుసరించాల్సి ఉంటుంది. అందులో ఆయన పర్యటన, భద్రతకు సంబంధించిన వివరాలు ఉంటాయి. దీన్ని కూడా కమిటీ విచారణ చేపట్టనుంది.