Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖ : విశాఖ పోర్టు ట్రస్ట్ (విపిటి) విషయంలో అదానీ వ్యూహం బెడిసికొట్టింది. విశాఖ పోర్టులో ఈక్యూ-1 బెర్తు వ్యవహారంలో అదానీ ఎంచుకున్న మధ్యవర్తిత్వ మార్గం ఆయన మెడకే చుట్టుకుంది. విశాఖ పోర్టుకు బెర్తును అప్పగించాలంటూ తాను ఆశ్రయించిన ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశాలివ్వడంతో అదానీ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. విశాఖ పోర్టు ద్వారా తాను రోడ్డు మార్గంలో వ్యాపారం చేసేందుకు 2011లో అదానీ ఈక్యూ-1 బెర్తును తీసుకున్నాడు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో రెండేళ్లు మాత్రమే కార్గో హేండ్లింగ్ చేసి తర్వాత వ్యాపారం చేయకుండా వదిలేశాడు. దీనిపై విశాఖ పోర్టు యాజమాన్యం 2017 సంవత్సరం నుంచి అదానీకి రిమైండర్స్ ఇస్తున్నా పట్టించుకోకుండా పోర్టు ఆదాయానికి గండికొడుతూ వచ్చారు. ఈక్యూ-1 బెర్తును తానే అభివృద్ధి చేసినందున తనకు విపిటి సుమారు రూ.385 కోట్లు చెల్లించాలంటూ 2021లో ఆర్బిట్రేషన్‌కు వెళ్లాడు. బెర్తును తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. తనకున్న పలుకుబడి ఉపయోగించుకొని పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. బెర్తును అదానీ వదిలేయాలని, ఈక్యూ-1 బెర్తు నిర్మించినందుకు పోర్టు చెల్లించాలని చూస్తోన్న రూ.150 కోట్లు స్వీకరించాలని ఆర్బిట్రేషన్ తన వాదనను తాజాగా వినిపించినట్టు సమాచారం. దీంతో, పోర్టు అధికార వర్గాలు ఇందుకు సంబంధించిన ప్రక్రియకు సిద్ధం అవుతున్నట్టు తెలిసింది.