Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హౌం సెక్రెటరీకి పార్లమెంటరీ ప్యానెల్ లేఖ
న్యూఢిల్లీ : వివాదాస్పద టెక్ ఫాగ్ యాప్‌పై హౌం వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (పీఎస్సీ) స్పందించింది. 'టెక్ ఫాగ్'తో సోషల్ మీడియా ట్రెండ్స్‌ను బీజేపీ మానిప్యులేట్ చేసిందన్న రిపోర్ట్‌ను 'ది వైర్' ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై సమాచారమందించాలంటూ కేంద్ర హౌం సెక్రెటరీకి కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ నేతృత్వంలోని కమిటీ లేఖ రాసింది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సంబంధిత మంత్రిత్వ శాఖలతో సహకరించడంతో పాటు ఈనెల 20 లోగా నివేదిక అందిచాలని పార్లమెంటరీ ప్యానెల్ హెడ్ ఆదేశించినట్టు సమాచారం. అనంతరం దీనిపై చర్చించాలని ప్యానెల్ యోచిస్తున్నట్టు ఆ వర్గాలు వివరించాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్.. టెక్ ఫాగ్పై 'ది వైర్' రిపోర్ట్‌ను పేర్కొంటూ హౌం వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్ సమావేశానికి డిమాండ్ చేస్తూ శర్మకు లేఖ రాశారు. అనంతరం పార్లమెంటరీ ప్యానెల్ హౌం సెక్రెటరికీ లేఖ రాయడం గమనార్హం.