Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : దేశంలో ముస్లింలు, ఇతర మైనారిటీలపై 'విద్వేష వ్యాఖ్యలు, మారణహోమ బెదిరింపులు' చేస్తున్న వారిపై నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షులు ఫరూఖ్ అబ్ధుల్లా గురువారం ఆగ్రహం వ్యక్తంచేశారు. మత విద్వేష వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా హరిద్వార్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై ఫరూఖ్ ఆందోళన వ్యక్తం చేశారు.ముస్లింలపై మారణహోమానికి ప్రత్యక్షంగా, బహిరంగంగా ప్రేరేపించడాన్ని నేరంగా పరిగణించే ఆర్టికల్ 3సిలోని మారణహోమ నేరం నిరోధక, శిక్ష (సీపీపీసీజీ) కింద నేరస్థులను కఠినంగా శిక్షించాలని అబ్దుల్లా కోరారు. 'ఈ ద్వేషపూరిత ప్రసంగ సమావేశాలు భారతీయ చట్టాల్లోని వివిధ నేరాలకు కూడా సరిపోతాయి. ఇలాంటి సమావేశాలు జాతీయ సమగ్రత, శాంతికి విరుద్ధమైనవి. ఈ దేశం యొక్క అధిపతి ప్రబలమైన నిశ్శబ్ధం, శిక్షార్హమైన చర్య లేకపోవడం ఇటువంటి విద్వేషకులకు ధైర్యం ఇచ్చింది' అని అబ్దుల్లా చెప్పారు. విద్వేషకులపై చర్యలు తీసుకుంటే కృతజ్ఞత తెలుపుతానని తెలిపారు.