Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండున్నర లక్షల కొత్త కేసులు..
న్యూఢిల్లీ: భారత్‌ను కరోనా మహమ్మారి పడగవిప్పుతోంది. కొత్త కేసులు భారీ సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి. తాజాగా రెండున్నర లక్షల సమీపానికి చేరాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 5 వేలకు పెరిగాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
ఒక్క ఢిల్లీలో 27,561 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి మొదలైనప్పటి నుంచి అక్కడ రోజువారీ నమోదైన కేసుల్లో ఇది రెండో అత్యధికం. కరోనా మహారాష్ట్రలో తీవ్రంగా విజృంభిస్తోంది. అక్కడ 46,723 మందికి వైరస్ సోకింది.కాగా దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 5 వేలు దాటాయి. నిన్న కొత్తగా 620 మందిలో ఈ వేరియంట్‌ను గుర్తించగా.. మొత్తం కేసులు 5,488కి చేరాయి. ఈ వేరియంట్ కేసుల పరంగా మహారాష్ట్ర(1,367), రాజస్థాన్(792), ఢిల్లీ(549) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటివరకూ 3.63 కోట్ల మందికి కరోనా సోకగా.. 24 గంటల వ్యవధిలో 380 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు మొత్తంగా 4.85 లక్షల మంది కరోనాకు బలయ్యారు.