Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
విశాఖ: రాజకీయ మార్పుతో కేంద్రంలోని బీజేపీ అవలంభిస్తోన్న విధానాలకు అడ్డుకట్ట వేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాట కమిటీ ఆధ్వర్యాన స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 336వ రోజుకు చేరాయి. గురువారం దీక్షల్లో కర్మాగారం ఎల్ఎంఎం, డబ్ల్యూఆర్ఎం, ఆర్ఎస్ అండ్ ఆర్ఎస్ఈ విభాగాల ఉద్యోగులు కూర్చున్నారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు రామారావు, శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీపై వ్యతిరేకత కనిపించడంతోనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిందని, వ్యవసాయ నల్లచట్టాలను ఉపసంహరించుకుందని తెలిపారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ మార్పు తథ్యం అనే సంకేతాలు వస్తున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల కలిగిన నష్టాన్ని ప్రజలకు తెలియకుండా బిజెపి నేతలు వక్రభాష్యాలు చెబుతున్నారని తెలిపారు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు అవార్డుల పంట
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్) నేషనల్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్స్ -2021లో పలు అవార్డులను గెలుచుకుంది.
15 పార్-ఎక్సలెన్స్ అవార్డులు, నాలుగు ఎక్స్లెంట్ అవార్డులు, ఒకటి డిస్టింగ్విష్ అవార్డును పొందింది. క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన 2021 డిసెంబర్ 27 నుండి 30 వరకు కోయంబత్తూరులో హైబ్రిడ్ మోడ్‌లో ఈ పోటీలు నిర్వహించారు.
13 ఎల్క్యూసి బృందాలు, 7 ''5ఎస్'' బృందాలు విశాఖ స్టీల్ ప్లాంట్ తరఫున పాల్గొన్నాయి. స్టీల్‌ప్లాంట్ అన్ని పార్-ఎక్సలెన్స్ అవార్డులు గెలుచుకుంది. విశాఖ ఉక్కు కర్మాగారం తరఫున మెరిట్ క్రమంలో మొదటి మూడు జట్లు బ్లాస్ట్ ఫర్నేస్ విభాగం నుండి ప్రాక్సీ టెక్, స్పెషల్ బార్ మిల్ నుండి ఆత్మనిర్భార్, లైట్ మీడియం మర్చంట్ మిల్ నుండి ఆల్ఫా జట్లు పాల్గొన్నాయి. అవార్డులు తెచ్చినందుకు విజేతలను స్టీల్‌ప్లాంట్ సిఎండి అతుల్ భట్, డైరెక్టర్లు అభినందించారు.