Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని భారత పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను స్వాధీనం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నామని వేదాంత గ్రూపు చైర్మెన్ అనీల్ అగర్వాల్ తెలిపారు. '' బీపీసీఎల్ మార్కెట్ కాపిటలైజేషన్ 11-12 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.83-90 వేల కోట్లు)గా ఉన్నది. మేం సరైన విలువకు బిడ్డింగ్ వేశాం'' అని అగర్వాల్ ఓ ఇంటర్యూలో తెలిపారు. మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ సంస్థను కార్పొరేట్ శక్తులకు విక్రయించడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇందులోని ప్రభుత్వానికి ఉన్న 53 శాతం వాటాను అమ్మకానికి పెట్టింది. బీపీసీఎల్ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.84,827 కోట్లుగా ఉంది. వచ్చే మార్చిలో కేంద్రం బిడ్లను తెరిచే అవకాశం ఉందని అగర్వాల్ పేర్కొన్నారు. ఇతర వ్యాపారాల గురించి కూడా అగర్వాల్ మాట్లాడుతూ జాంబియాలోని తమ రాగి యూనిట్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 3 బిలియన్ డాలర్లు (రూ.22,500 కోట్లు) పెట్టుబడులు పెట్టామన్నారు. సౌదీ అరేబియాలోని జింక్ మైనింగ్ ప్రాజెక్టుల్లో తమ సంస్థకు అవకాశాలున్నాయన్నారు.