Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు మృతి.. బోగిల్లోనే గాయాలతో భారీగా..
- పశ్చిమబెంగాల్ జల్‌పాయిగురి వద్ద ప్రమాదం..
జుల్ఫైగురి: పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయిÛగురిలో గురువారం సాయంత్రం భారీ రైలు ప్రమాదం జరిగింది. బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ దోమోహని సమీపంలోని మోనోగురి వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా..20 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. అయితే బోగిల్లో గాయాలపాలైన వారిసంఖ్య భారీగానే ఉండొచ్చని జల్‌పాయిగురి రైల్వేడీఎం తెలిపారు. కోచ్‌లలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 40 మందిని రక్షించారు. చీకటి కారణంగా సహాయక చర్యలు కష్టతరంగా మారుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని మోడీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఫోన్‌లో మాట్లాడారు.
ఏం జరిగింది..?
బికనీర్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం రాత్రి రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి బయలుదేరింది. ఈ రైలు గురువారం ఉదయం 5.44 గంటలకు పాట్నా రైల్వే స్టేషన్ నుంచి గౌహతికి బయలుదేరింది. సాయంత్రం పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయిÛగురికి రాగానే పట్టాలు తప్పింది.12 బోగిలు ఒక్కొక్కటిగా పక్కకు ఒరిగిపోయాయి. అందులో రెండు బోగిలు చెరువులో పడిపోయాయి. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. కాపాడాలంటూ రోదనలు మిన్నంటాయి. గాయాలపాలై ఉన్న ప్రయాణికులు బోగి కింద ఉన్న పట్టాలపై నుంచి బయటపడ్డారు. సెలవులు,కరోనా భయాలతో ఊళ్లకు వెళ్తున్న ప్రయాణికులు ఉండగా..ఈ రైలు ప్రమాదానికి గురైంది. కోచ్‌లలో చిక్కుకున్న వారిని గ్యాస్ కట్టర్‌ల ద్వారా బయటకు తీస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను రాష్ట్ర ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. క్షతగాత్రులకు వీలైనంత త్వరగా ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. రైల్వే ఎమర్జెన్సీ నంబర్ 8134054999 జారీ చేసింది.036-2731622 , 036-2731623 అనే రెండు హెల్ప్‌లైన్ నంబర్‌లు ప్రకటించింది. కాగా మృతుల కుటుంబీకులకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా దెబ్బలు తగిన వారికి రూ.25,000 చొప్పున పరిహారం అందజేయనున్నట్టు రైల్వే ప్రకటించింది.