Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుత పాలనలో పేదల పట్ల ఎలాంటి సంబంధమూ లేదు
- దశాబ్దకాలంలో జరిగిన సంఘనల గురించి ఆలోచించాలి
- ప్రజాస్వామ్య విలువలకు ఇవి పూర్తిగా విరుద్ధం
- ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్
న్యూఢిల్లీ: దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, మోడీ పాలనతో పాటు పలు అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ స్పందించారు. గత దశాబ్ద కాలంలో జరిగిన సంఘటనల గురించి భారత దేశం ఆలోచించాన్నారు. ప్రజాస్వామ్య విలువలను నిర్మించడంలో ఇవి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్నాయని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం వ్యక్తిగత స్వేచ్ఛకు చాలా చెడ్డదని ఆయన నొక్కి చెప్పారు. ఇది నేరం లేని చోట లేదా వ్యక్తుల అరెస్టుకు అనుమతిస్తుందన్నారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు కావస్తున్నా ఇంకా అసమానతలు కొనసాగటం దురదృష్టకరమన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యం లోపానికి ప్రభుత్వం వ్యవహరించే విధానం, ప్రజల సమస్యల గురించి ఆలోచించే విధానం సంబంధాన్ని కలిగి ఉంటుందన్నారు. సేన్ ఇటీవల విడుదల చేసిన తన జ్ఞాపకాలు 'హౌమ్ ఇన్ వరల్డ్' నేపథ్యంలో కొన్ని సంఘటనల గురించి మాట్లాడారు.
పాఠశాల విద్య
గత రెండేండ్లు, దేశంలో పాఠశాలల మూసివేతలపై సేన్ మాట్లాడారు. పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో పాఠశాల విద్యా విధానం చాలా లోపభూయిష్టంగా ఉన్నదన్నారు. మహమ్మారి లేని సమయంలోనూ ఈ వ్యవస్థ చేయాల్సిన విధిని చేయలేదని తెలిపారు. '' విద్యలో మనకు స్వేచ్ఛ అవసరం. స్వతంత్ర ప్రతిపత్తికి అవకాశం కల్పించే విద్య మనకు అవసరం. కోవిడ్ కారణంగా పాఠశాల మూసివేతలు, ఉపాధ్యాయుల కొరత అనేవి కచ్చితమైన సమస్యలే. కానీ, అవి మన సమస్యలు మాత్రమే కాదు'' అని అమర్త్యసేన్ అన్నారు.
ఉపా
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యూఏపీఏ (ఉపా)ను కఠినంగా ఉపయోగించడాన్ని అమర్త్యసేన్ తీవ్రంగా వ్యతిరేకించారు. వీటిని బ్రిటిషు రోజులలో ఉన్న పరిస్థితులతో ఆయన పోల్చారు. '' ఇది (ఉపా) భారతదేశంలో కొనసాగుతుందని నేను ఊహించలేదు. కానీ, ఇది కొనసాగుతోంది. ప్రస్తుత పాలనలో ఇది మరింత ఎక్కువగా ఉన్నది. ఉపా అనేది వ్యక్తిగత స్వేచ్ఛకే కాదు.. విద్య అనేది ఏది కలిగి ఉండాలి, ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడంలో ప్రమాదకరమైనది'' అని అమర్త్యసేన్ అన్నారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో అసమానతలు కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత దశాబ్దకాలంగా దేశం ముందుకు సాగుతున్న తీరు సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్నదనీ, దీనిపై మనం ఆలోచించాలన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందన్నారు. పేదలు, వారి అవసరాలను కేంద్రం పూర్తిగా విస్మరించడమే సమస్యలో ఎక్కువ భాగమని అమర్త్యసేన్ అన్నారు. దళితులు, గిరిజన సమూహం భయంకరమైన సమయంలో వెళుతుందనీ, ఇవన్నీ ఒకరిపై ఒకరు అసమానత, అన్యాయానికి దారి తీస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చాలన్నారు.
రాజకీయ నాయకత్వం
రాజకీయ నాయకత్వం, ప్రజా నేతృత్వంలోని ఉద్యమాల విజయం గురించి మాట్లాడుతూ మనకు రెండూ అసరమేనని భావిస్తున్నానని తెలిపారు. సంకుచిత మనస్తత్వం ఉన్న మెజారిటీ వాదులు.. మైనారిటీల పట్ల చెడుగా ప్రవర్తించే కొందరు ఉంటే ప్రజలను ఎప్పటికీ మార్చలేరని నమ్ముతున్నట్టు చెప్పారు. అలా జరగడం దురదృష్టకరమన్నారు. సంకుచితమైన మెజారిటీవాదం మనుగడ సాగించకూడదని డిమాండ్ చేయడానికి చాలా కారణాలున్నాయన్నారు. బ్రిటీషు పాలనలో జరిగిన అనేక తప్పులు ప్రస్తుతం మోడీ పాలనలో పునరావృతమవుతున్నాయని తెలిపారు.